చలికాలంలో వీలైనంత వరకు బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. చలికాలంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీనికి సరైన ప్రత్యామ్నాయం ఖర్జూరం. శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అయితే చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.