హిందూపురంలో గురువారం తెలుగు నాడు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో భాగంగా నేను అధికారంలోకి వస్తే విద్యార్ధులందరికి ఎంత ఖర్చైనా భరిస్తానని హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చే సరికి మాట తప్పారని, గడిచిన నాలుగున్నరేళ్లుగా విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారని పేర్కొన్నారు.