హెల్తీ డ్రింక్స్ తాగడం వల్ల అధిక బరువు సమస్యను చెక్ పెట్టవచ్చు. ఒక బౌల్‌లో నీరు, అల్లం వేసి మరిగించాలి. ఆ తర్వాత అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఇది కొలెస్ట్రాల్‌ను బర్న్ చేస్తుంది. అలాగే జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది కడుపులో బ్యాక్టీరియా ఎదుగుదలకు ప్రోత్సాహిస్తుంది. అధిక బరువుకు చెక్ పెడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు దోస, కీరా, ఇతర హైడ్రేటింగ్ ఐటెమ్స్‌తో జ్యూస్ చేసుకొని ప్రతిరోజూ ఉదయం తాగడం మంచిది. దీనికి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేయవచ్చు. ఈ డిటాక్స్ డ్రింక్ హైడ్రేషన్‌ను పెంచుతూ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. తద్వారా జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.