బాదంలో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయి. ఉదయం ఓట్స్ తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. గుడ్డు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగిస్తుంది. తెల్లసొన తీసుకుంటే బి12, డి విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందుతాయి. ఇవి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆకలిగా ఉన్నప్పుడు పండ్లు తింటే మంచిది. ఇలా చేస్తే కొవ్వు పోయి బరువు తగ్గుతారు.
ప్రస్తుతం చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆహారంలో లెమన్‌గ్రాస్ ఆయిల్ వాడటం వల్ల శరీరంలోని అధిక కొవ్వును తగ్గించుకోవచ్చు. ఈ నూనెను ప్రతి వంటకంలో సాధారణ నూనెగా వినియోగించకూడదు. దీన్ని ఆహారంలో ఉపయోగించాలనుకుంటే ప్రతిరోజూ 2 నుంచి 3 చుక్కలను మాత్రమే ఆహారంలో వాడాలి. ఈ ఆయిల్‌లో ఉండే టెర్పెనాయిడ్ సమ్మేళనాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పై ప్రభావం చూపి, కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.