రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం వల్ల శరీరంలో కొవ్వులు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దాల్చిన చెక్క తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ ప్రభావం పెరిగి.. రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఫలితంగా శరీరంలో కొవ్వులు పేరుకుపోకుండా ఉండడంతో పాటు స్థూలకాయం, డయాబెటి. వంటి ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. దాల్చిన చెక్కలోని హైడ్రాక్సీసినమాల్డిహైడ్ అనే సమ్మేళనం రక్తంలోని హానికారక కొవ్వుల్ని తగ్గిస్తుంది. జీవక్రియల్ని వేగవంతం చేసి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దాల్చినచెక్కలో ఉండే.. క్రోమియం ఆకలిని కంట్రోల్‌లో ఉంచి.. అతిగా తినకుండా చూసుకుంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే.. మీ రోజూవారీ ఆహారంలో దాల్చినచెక్కను చేర్చుకోండి. మీరు రోజూ దాల్చినచెక్క టీ తాగినా మంచిదే.