వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో.. డ్యూటీలో ఉన్న ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ హైమావతిపై దాడి జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై రాయితో దాడి చేయగా.. ఆమె కాలికి గాయమైంది.
సెల్ఫోన్ పగిలిపోయింది. రామేశ్వరం బైపాస్ రోడ్డులోని రెండు కుళాయిల సమీపంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్.. నిందితులను త్వరగా పట్టుకోవాలని ప్రొద్దుటూరు పోలీసులను ఆదేశించారు.