విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఇవాళ నేవీ డే వేడుకలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు.
కాగా, భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం (నేవీ డే) నిర్వహిస్తారు. ఈ ఏడాది మిచాంగ్ తుపాను కారణంగా 4న జరగాల్సిన వేడుకలను 10వ తేదీకి వాయిదా వేశారు.