సాధారణంగా చాలా మంది ఉదయాన్నే నిద్ర లేచేందుకు అలారం పెట్టుకుంటారు. కానీ, రింగ్ కాగానే లేచేందుకు బద్దకిస్తూ స్నూజ్ చేస్తుంటారు. అయితే, ఇలా చేస్తే మెదడుపై చెడు ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలారం మోగాక స్నూజ్ చేస్తూ మళ్లీ నిద్రలోకి జారుకునేటప్పుడు బ్రెయిన్ స్లీప్ సైకిల్ ప్రారంభమవుతుంది. ఇది పూర్తయ్యేందుకు 75-90 నిమిషాలు పడుతుంది. కానీ, మనం స్నూజ్ చేసేది 10 నిమిషాలకే కనుక బ్రెయిన్ గాఢ నిద్ర మేల్కొనాల్సి రావడంతో ప్రభావం పడుతుందని శాస్త్రీయంగా వివరిస్తున్నారు.