చలికాలంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. వీటి పట్ల జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ డ్రింక్స్ తాగితే ఈ సమస్యలు దూరమవుతాయి. ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగాలి. అదే విధంగా గ్లాసు గోరువెచ్చని పాలలో ఓ టీ స్పూన్ పసుపు పొడి కలిపి తాగండి. ఉదయం నిద్రలేచిన తర్వాత వేడివేడి అల్లం టీ తాగడం మంచిది. అల్లంలోని ఔషధ గుణాల కారణంగా ఛాతీలో ఏర్పడిన కఫాన్ని తొలగిస్తుంది.