రాష్ట్రంలో చలి తీవ్రత అధికమవడంతో రాత్రి నుంచే ప్రభావం కనపడుతోంది. ఉదయం 9 దాటినా మంచు వీడటం లేదు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో చలిపులి పంజా విసురుతోంది. గురువారం అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతలంలో 5.6 డిగ్రీలు, జి.మాడుగులలో 6.1 డిగ్రీలు, అరకులో 6.7, చింతపల్లిలో 7.0 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో 10-13 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.