రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నరసింహ, అంజలిప్రియ, హిందు అనే విద్యార్థులు జాతీయస్థాయి జూనియర్ త్రో బాల్ జట్టుకు ఎంపికయ్యారు. ఈనెల 27 నుంచి 29 వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో జరగనున్న పోటీలకు వెళుతుండడంతో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామాంజనేయులు వారిని ప్రోత్సహించి గురువారం రూ. 15 వేలను ఆర్థిక సాయం అందించారు.