నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకుముందు టీ20 సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేసింది. కానీ చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (114 బంతుల్లో 108) భారత ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాడు. శాంసన్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. తిలక్ వర్మ (52; 77 బంతుల్లో) చాలా బంతులు తీసుకున్నాడు, టీమ్ ఇండియా రన్ రేట్ ఒక స్థానంలో తగ్గింది. కానీ మరో ఎండ్‌లో ఉన్న శాంసన్ బౌండరీలతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు.
అనంతరం దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. అర్షదీప్ సింగ్ (4/30), వాషింగ్టన్ సుందర్ (2/38), అవేష్ ఖాన్ (2/45) రాణించారు. సఫారీ ఓపెనర్ టోనీ డిజార్జ్ (81; 87 బంతుల్లో) తడబడ్డాడు. శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. జట్టులో ఉన్న అందరూ గొప్ప క్రికెటర్లే. వారికి అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేదంతే. కాస్త సమయం ఇస్తే సరిపోతుంది. ఇక జట్టు నిర్దేశించిన పాత్రల్లో వారు సత్తాచాటారు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో సంజు శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. దురదృష్టవశాత్తు అతడికి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు అవకాశాలు ఇవ్వలేకపోయాం. ఎందుకంటే వన్డేల్లో ఆ కీలక స్థానాలు ఆక్రమించే దిగ్గజాలు ఉన్నారు. అయితే వచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉంది'' అని రాహుల్ అన్నాడు.