ఊపిరితిత్తుల క్యాన్సర్ సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు కారణాల వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధిక వాయు కాలుష్యం వల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. సిగరెట్ తాగుతున్న వారి చుట్టూ నిలబడి ఉండటం కూడా కారణమని నిపుణులు అంటున్నారు. వాతావరణం, ఉష్ణోగ్రతలలో మార్పుల కారణంగా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు. ధూమపానం మానేసిన వ్యక్తులకు తక్కువగా వచ్చే అవకాశాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు.