స్ట్రాబెర్రీలు తినడానికి తియ్యగా, పుల్లపుల్లగా ఉండటంతో ఈ పండ్లను ఇష్టపడి తింటారు. వీటిలో పోషకాలూ అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
స్ట్రాబెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.ఇవి తరచూ తింటే, గుండెపోటు ముప్పు తగ్గుతుందని తెలిపారు. స్ట్రాబెర్రీలలో ఉండే పొటాషియం హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.