బొప్పాయి గుజ్జులో ఉండే విటమిన్ ఏ, సీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బొప్పాయి తింటే జలుబు, ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను కలిగించే బాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ పొందొచ్చు. బొప్పాయి దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాలిన గాయాలు, గాట్లకు మంచి మందుగా పనిచేస్తుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, విటమిన్ సీ వల్ల అనారోగ్యాల వల్ల వచ్చే నొప్పులు, మంటలు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్ధకం, ఆసిడిటీని బొప్పాయి పోగొడుతుంది.