ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మరిన్ని కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తన బ్లాగ్‌లో రాశారు. రాబోయే రోజుల్లో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణ ప్రజలు కూడా దీనిని వాడటం మొదలుపెడతారని పేర్కొన్నారు.
2024లో ఏఐ మరింత వేగవంతం అవుతుందని, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో ప్రధాన పాత్ర పోషించబోతోందని అంచనా వేశారు.