మిగిలిన ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో ఉంచి ఒకటి, రెండు రోజులు తినడం చాలామందికి అలవాటు. నాన్ వెజ్ విషయంలో ఇలాంటి సందర్భాలు అనేకం. అయితే ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారాన్ని ఒక పూటకంటే ఎక్కువసార్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా తింటే ఇన్ఫెక్షన్లు రావడం ఖాయం అంటున్నారు. వాటిల్లో పేరుకు పోయిన బ్యాక్టీరియా మన శరీరాన్ని ఇన్ఫెక్షన్‌కు గురి చేస్తుందని చెబుతున్నారు.