సాధారణంగా చిలగడదుంపను చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని ఉడకబెట్టి, కూరగా, కాల్చుకొని కూడా తినవచ్చు. వీటిలో విటమిన్ ఏ, B-6, సీ, డీ, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకుంటే గుండె సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ దుంపల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. కరిగి, కరగని ఫైబర్ రెండూ సమృద్ధిగా ఉంటాయి. ఈ ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.