తులసి ఆకులతో ఎన్నో ఔషధ గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందని పేర్కొన్నారు. జీర్ణాశయ సమస్యలను దూరం చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే గుణం తులసి ఆకులకు ఉంది. తులసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. తలనొప్పి మరియు నిద్రలేమికి మంచి ఔషధంగా ఉంటుంది. తులసి ఆకులలో ఉండే యూజినాల్ జీర్ణవ్యవస్థలో సమస్యలను పోగొడుతుంది. శరీరంలో ఉండే వివిధ ఎంజైములను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.