మిరియాల పొట్టును ఒక సంచిలో వేసి దాన్ని ఒక దిండుగా కూడా ఉపయోగిస్తారు. దీంతో తలనొప్పి వంటి దీర్ఘవ్యాధులు నయమవుతాయి. లాలాజలం ఎక్కువగా ఊరేట్టు చేసి జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తాయి. పొట్టలోని వాయువులను బయటికి పంపి రక్తప్రసరణ వేగవంతమయేలా చేస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కండరాల నొప్పులు దూరమవుతాయి. ఘాటైన వాసనను కలిగి ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగిస్తాయి.