చలికాలం కావడంతో చాలా మంది గీజర్ నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు. అలా గీజర్ నీళ్లతో స్నానం చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. నీటి ఉష్ణోగ్రత 120°F (48.9°C) దాటకుండా చూసుకోవాలి. వేడి దీనికంటే దాటితే చర్మం కాలే ప్రమాదముంది. చిన్నపిల్లలకు స్నానం చేయించే ముందు వాటర్ టెంపరేచర్ చూడటం మర్చిపోవద్దు. గీజర్లను ఎక్కువ సేపు ఆన్‌చేసి ఉంచకూడదు. ఇది ఎక్కువసేపు వేడెక్కడం వల్ల దాని బాయిలర్‌లో ఒత్తిడి పెరిగి పేలిపోవచ్చు. బాత్రూంలో రేడియోలు, హెయిర్ డ్రయ్యర్లు ఉంచకపోవడం మంచిది.