జామ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో విటమిన్లు బీ12, బీ6 ఉంటాయి. ఇవి మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. జామపండ్లలో అధికంగా ఉండే విటమిన్ సి వల్ల మన రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చలికాలంలో వచ్చే జలుపు, జ్వరం, తలనొప్పి వంటి మరికొన్ని సీజనల్ వ్యాధులను తగ్గించడంలో కూడా జామపండ్లు సహాయపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.