జిమ్‌కు వెళ్లడం ద్వారా శరీరానికి మంచి వ్యాయామం అందించవచ్చు. చాలామంది ఈ సమయంలో కఠినమైన డైటింగ్ పాటిస్తారు. ఇది మంచిది కాదు. ప్రతీ భోజనంలో ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి. క్యారెట్, కీరా ముక్కలు కలిపిన శనగలు, అలసందలు తీసుకోవచ్చు. సలాడ్, సూప్‌లో పనీర్ ముక్కలు, సోయా లాంటివి వేసుకోవచ్చు. తక్కువ తిన్నా సరే, ప్రొటీన్ తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువ తాగాలి.