గండికోట ముంపు వాసులను ఎన్నికల ముందు రూ.10 లక్షల పరిహారము ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి మాట తప్పారని జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి అన్నారు.బుధవారం ఉదయం కొండాపురం పట్టణంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రతి ఇంటింటికి తిరుగుతూ (మహాశక్తి )సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు.సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్నారు.