ఏపీలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు పొడిగించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తుల గడువును వారం రోజుల పాటు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
అభ్యర్థులు జనవరి 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa