ఆరోగ్య సమస్యలకు కొన్ని పండ్లు, కూరగాయలు తింటే మంచి ఫలితమే కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఈ జ్యుసి పండులో విటమిన్ బి6, సీ, ఐరన్, కాపర్, క్యాల్షియం, వంటి అనేక పోషకాలు ఉన్నాయి. పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉండటంతో జీర్ణక్రియ సరిగా జరుగుతుంది. కీళ్ల నొప్పులు, కడుపు ఇన్ ఫెక్షన్ ఉంటే పైనాపిల్ తినడం వల్ల తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.