మేషం: చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.
వృషభం: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
మిధునం: వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.
కర్కాటకం: దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.
సింహం: ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దాయదులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి.
కన్య: మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
తుల: దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.
వృశ్చికం: చేపట్టిన పనులలో అధిక శ్రమ ఫలితాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.
ధనస్సు: ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.
మకరం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.
కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలు ఉన్నవి.
మీనం: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.