చాలా మందికి ప్రతిరోజూ ఉదయం పూట పిడికెడు నానబెట్టిన శనగలు తినడం అలవాటు. నానబెట్టిన శనగలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే నానబెట్టిన శనగల్లో ప్రోటీన్, సోడియం, కాల్షియం, ఫైబర్ ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. జీర్ణ సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది. హానికరమైన టాక్సిన్స్‌ను తొలగిస్తుంది.