రక్తప్రవాహం ద్వారా కొన్నిరకాల బాక్టీరియా చిగుళ్ళ నుంచి శరీరంలోని అన్నిభాగాలకు ప్రవహిస్తుంది. రక్తప్రవాహంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే అది రోగనిరోధక వ్యవస్థతో పోరాడి తాపజనక ప్రతిచర్యను సృష్టిస్తుంది. అందుకే గుండెపోటు, పక్షవాతం, ధమనులు గట్టిపడటం లాంటి సమస్యలను ఎక్కువగా చిగుళ్ల వ్యాధి ఉన్నవారు ఎదుర్కొంటారు. ప్రపంచంలో 30 శాతం మంది ప్రజలు ఈ నోటి దుర్వాసనతో ఇబ్బందులను పడుతున్నారు.