ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట జరుగనుంది. ఈ క్రమంలో రామాలయానికి సమకూరిన విరాళంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.
‘దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రామాలయానికి విరాళాలు అందుతున్నాయి. కానుకలు వస్తున్నాయి. రోజుకు రూ.3-4 లక్షల రూపాయలు విరాళంగా వస్తున్నాయి. నెల మొత్తం మీద చూసుకుంటే రూ.1.5 నుంచి రూ.2 కోట్ల వరకు నిధులు సమకూరుతున్నాయి. ఆన్లైన్ విరాళాలు లెక్కించాలి.’ అని ఆయన అన్నారు.