ఓ వ్యక్తి మూడు రోజులుగా సెల్ టవర్ పైనే తిష్ట వేసి నిరసన తెలియజేస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా చినమిరం గ్రామానికి చెందిన లోకం ఏసు ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు ఇస్తేనే సెల్ టవర్ పైనుంచి దిగుతానని ఆందోళనకు దిగాడు.
తన తండ్రి సత్యనారాయణకు ఓ బ్యాంకులో రూ.20 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించాడు. సత్యనారాయణ యాక్సిడెంట్ లో చనిపోగా ఇన్సూరెన్స్ క్లైమ్ చేయమంటే ఇన్సూరెన్స్ చేయలేదని సిబ్బంది చెప్పడంతో నిరసన చేపట్టాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa