కామెర్లు ఉన్న వారి మూత్రం, కళ్ళు, గోర్లు పసుపు రంగులోకి మారుతాయి. శరీరం చాలా బలహీనంగా మారుతుంది. కామెర్లు వచ్చినప్పుడు ఉడకబెట్టిన ఆహారం తిని శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి.
పసుపు రంగులో ఉండే నూనె, నెయ్యి, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి. మాంసాహారం తీసుకోవడం మానేస్తే త్వరగా కోలుకోవచ్చు. గ్రీన్ టీ తాగవచ్చు. పండిన బొప్పాయి ఆకు రసం తాగాలి. పచ్చి ఉసిరి లేదా ఉసిరి రసాన్ని తాగవచ్చు.