కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీ-టెట్) ఆదివారం గుంటూరు జిల్లాలో సజావుగా జరిగింది. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన పేపర్-1, 2 పరీక్షలకు దరఖాస్తు చేసిన 1, 550 మంది
అభ్యర్థుల్లో 1, 090 మంది హాజరయ్యారు. గుంటూరు నగరంలోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య స్కూల్, డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్, శ్రీవేంకటేశ్వర బాలకుటీర్ తో పాటు పొన్నూరులోని నాట్కో స్కూల్లో పరీక్ష కేంద్రాలును అధికారులు ఏర్పాటు చేశారు.