సాధారణంగా చలికాలంలో ఎముకలు, కీళ్లు గట్టిగా మారి నొప్పులకు దారి తీస్తుంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చలికాలంలో రోజూ కనీసం అరగంట పాటు కచ్చితంగా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
వాకింగ్, రన్నింగ్, జాగింగ్, డ్యాన్సింగ్.. కనీసం మెట్లు ఎక్కడం లాంటివి అయినా చేస్తూ ఉండాలి. స్విమ్మింగ్ కూడా బెస్ట్ ఆప్షన్. ఇక యోగా లాంటివి అలవాటు చేసుకుంటే ఎముకలు దృడంగా మారుతాయి.