ఏపీలో టీచర్ల నియామకాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. వారం రోజుల్లో 6 వేల నుంచి 10 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇందులో ఎస్జీటీ పోస్టులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న మంత్రి బొత్స విద్యా శాఖ అధికారులతో డీఎస్సీపై కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు సేకరించారు. కాగా విద్యాశాఖలో 18,500 పోస్టులు ఉన్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది.