తక్కువ ఖర్చుతో సమర్థమైన సెమీకండక్టింగ్ పదార్థం అభివృద్ధికి ఒక కొత్త విధానాన్ని భారత్, ఆస్ట్రియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అల్ట్రావైడ్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్ అయిన గాలియం ఆక్సైడ్‌ను చౌకలో అభివృద్ధి చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాలు, హైవోల్టేజ్ ట్రాన్స్‌మిషన్ వంటి రంగాల్లో పవర్ ఎలక్ట్రానిక్స్ సమర్థతను ఇది గణనీయంగా పెంచుతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ ఐఐటీ, ఆస్ట్రియాలోని వియన్నా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు.