ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేటెస్ట్ అప్ డేట్స్ తో ఆకట్టుకుంటున్న ఇన్ స్టాగ్రామ్.. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. వాట్సాప్ మాదిరిగానే మెసేజ్‌లు పంపిన 15 నిమిషాల్లోగా వాటిని ఎడిట్ చేసుకునే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
మెసేజ్‌లో తప్పులు దొర్లినా వాటిని అన్‌సెండింగ్ చేయకుండానే ఎడిట్ చేసుకునే సౌలభ్యం కలగనుంది. 15 నిమిషాల తరువాత ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. ఆ తర్వాత మెసేజ్‌ను ప్రెస్ చేసి హోల్డ్ చేసి కనిపించే ఆప్షన్స్ నుంచి ఎడిట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మీరు మార్చాలనుకుంటున్న టెక్ట్స్‌ను మార్చేస్తే సరిపోతుంది. మార్పులు చేసిన తర్వాత చాట్‌లో మీ మెసేజ్‌ను అప్‌డేట్ చేసేందుకు సెండ్‌ను ట్యాప్ చేయాలి.