ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా కంటే ముందే తన ప్రత్యర్థి సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది.
తమిళనాడులోని తూత్తుకూడిలో 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.16,600 కోట్లు) పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఈ నెల 25న శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.