కిడ్నీలో రాళ్లు, ఇతర సమస్యలను కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముందు వెన్ను లేదా నడుం నొప్పి కోసం తనిఖీ చేసుకోవాలి. మూత్రవిసర్జన సమయంలో మంట ఉందో లేదో పరిశీలించుకోవాలి. మూత్రంతో పాటు రక్తం లేదా మందపాటి ఎరుపు, ముదురు మెరూన్ రక్తం వస్తే వెంటనే అలర్ట్ కావాలని డాక్టర్లు చెబుతున్నారు. యూరిన్ ఆపుకోలేకపోవడం, మూత్రవిసర్జనలో నొప్పిగా ఉంటే చూపించుకోవాలని సూచిస్తున్నారు.
కన్నీరు ఆరోగ్యానికి మంచిదే: బాధ కలిగిన సమయంలో కన్నీరు కూడా హెల్త్ కు మంచిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏడ్చినప్పుడు మన భావోద్వేగాలు అదుపులో ఉంటాయట. తద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందట. ఇది మాత్రమే కాదు మనం చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏడ్చినట్లయితే, అది మన మనస్సును రిలాక్స్ చేస్తుందట. ఏడుపు పారాసింపథెటిక్ నాడీవ్యవస్థను సక్రియం చేస్తుందని చెబుతున్నారు. ఏడ్వడం మంచి అనుభూతిని కలిగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.