మన అలవాట్లు, జీవన విధానాన్ని మార్చుకుంటే మరణం మనకెంత దూరంగా జరుగుతుందనే అంశంపై సైంటిస్టులు అధ్యయనం చేశారు. శారీరక వ్యాయామం చేస్తే 46%, ధూమపానం అలవాటు లేకుంటే 30%, మంచి శాకాహారం తీసుకుంటే 21%, మద్యాన్ని మానేస్తే 19%, 7-9 గంటల నిద్ర ఉంటే 18%, సానుకూల సామాజిక సంబంధాలుంటే 5% చావు ప్రమాదం తగ్గుతుందట. వీటన్నింటినీ పాటిస్తే 73% మరణ ప్రమాదం నుంచి దూరంగా ఉండొచ్చట. ఇందులో మీరెన్ని పాటిస్తున్నారు?