జర్నలిస్టుల పైన మరియు పత్రిక కార్యాలయాలపై వరస దాడులను ఖండిస్తూ అనంతపురంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు రామ సుబ్బారెడ్డి పిలుపుమేరకు బద్వేలు ప్రాంత జర్నలిస్టులు గురువారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లారు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన శిక్షలను అమలు చేయాలని కోరుతూ "చలో అనంతపురం" కార్యక్రమం చేపట్టారు.