మొలకలు తినడం వల్ల కేవలం ప్రోటీన్ అందడమే కాదు.. శరీరానికి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొలకెత్తిన ధాన్యాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇది డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. మొలకెత్తిన ధాన్యాలు తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ రోగులకు మంచిది. మొలకలు ప్రతిరోజూ తీసుకోవడం వల్ల గుండెకు చాలా మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.