ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు తగ్గితే అలసట వచ్చేస్తుంది. రక్తహీనత, ఐరన్ లోపంతో ఏకాగ్రత లోపించడమే కాకుండా కండరాలు అలసిపోయి, నొప్పులు వేధిస్తాయి.
రక్తప్రవాహం, రక్తకణాలు తగ్గడం మూలంగా చర్మం పాలిపోతుంది. మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. తరచూ ఇన్ఫెక్షన్లు వచ్చినా రక్తహీనత ఉన్నట్లే అని గుర్తించాలి. ఈ సమస్యలు ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.