అనంతపురం ఆంజనేయస్వామి ఆలయ రథోత్సవ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం రాత్రి రథం లాగుతుండగా.. కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన కుందుర్పి మండలం అపిలేపల్లిలో జరిగింది. రథం కుప్పకూలడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గాయపడిన భక్తులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa