వ్యాయామం ఎవరికైనా ఒకటే. కానీ ఇది ఆడవారికి ఒకింత ఎక్కువ మేలు చేస్తుంది. ట్రెడ్‌మిల్ మీద నడవటం, ఆటలు ఆడటం, కాస్త వేగంగా పరుగెత్తటం వంటివి సమానంగా చేసినా
మగవారి కన్నా ఆడవారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతున్నట్టు జర్నల్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. వ్యాయామంతో ఆడవారిలో అకాల మరణం ముప్పు 24% తగ్గగా.. మగవారిలో 15% మాత్రమే తగ్గటం గమనార్హం.