మహాశివరాత్రి హిందువుల అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజు ఉపవాసం పాటించేవారు శివమంత్రం ఓం నమః శివాయ పఠించాలి. రాత్రిపూట 4 గంటల పాటు పండ్లు, పుష్పాలు, చందనం, బిల్వ పత్రాలు, ధాతుర, ధూపం, దీపాలతో శివుడిని పూజించాలి.
అలాగే పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేసి తర్వాత నీటితో అభిషేకించాలి. భవ, శర్వ, రుద్ర, పశుపతి, ఉగ్ర, మహాన్, భీముడు, ఈశానుడు అనే పేర్లతో పుష్పాలను సమర్పించి, శివునికి హారతి ఇవ్వాలి.