ప్రతిరోజూ రన్నింగ్ చేయడం వల్ల మెదడులోని కణాలు రిలాక్స్ అవుతాయి. దీంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో బాధపడుతున్నారు. ప్రతిరోజూ పరుగెత్తడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడుతారు. ఫలితంగా జీవిత కాలం పెరుగుతుంది. రన్నింగ్ చేయడం వల్ల కండరాలు గట్టిపడుతాయి. ముఖ్యంగా కాళ్ల ఎముకలు శరీర బరువును మోస్తాయి. రన్నింగ్ చేసే సమయంలో వీటి కదలికతో అవి గట్టి పడుతాయి.