శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి. యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం, అజీర్ణం, ముఖంపై మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. నీటి కొరత వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఏర్పడి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమస్యలను నివారించేందుకు ప్రతి రోజూ కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.