మన శరీరంలో జీర్ణక్రియ సాఫీగా సాగాలా చూసుకోవాలి. ఇందుకు ఫైబర్ చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు. దీని ద్వారా మలబద్ధకం సమస్యను నివారించవచ్చని, ఫైబర్ ను శరీరం బాగా గ్రహించాలంటే తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు. ఫైబర్ అధికంగా ఉండే యాపిల్స్, పియర్స్, బెర్రీస్, బీన్స్, తృణ ధాన్యాలు, ఆకు కూరలు, స్వీట్ పొటాటోస్, నట్స్, సీడ్స్, అంజీర్ వంటివి తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు
భోజనం తర్వాత స్వీట్స్ తింటే: చాలామంది రాత్రి భోజనం తర్వాత స్వీట్స్ తినడం అలవాటు ఉంటుంది. అలా తినడం కాదని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం తర్వాత స్వీట్స్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి గుండెపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని, రక్తంలో చక్కెర స్థాయిలో అకస్మాత్తుగా హెచ్చు తగ్గుల మార్పులకు దారి తీస్తుందని సూచిస్తున్నారు. దీంతో ఆందోళన, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.