ఎక్కువగా మొలకెత్తిన విత్తనాలలో తినేవి పెసర్లు, శనగలు, పల్లీలు. కానీ మొలకెత్తిన రాగులను తినడం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మొలకెత్తిన రాగులు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ఇవి సేంద్రీయంగా గ్లూటెన్ రహితంగా ఉంటాయి. పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. అనీమియా విషయంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులోని అమినో యాసిడ్స్ చిగుళ్ల వ్యాధి నుంచి రక్షిస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును ప్రోత్సహిస్తాయి.
శొంఠి వలన కలిగే ప్రయోజనాలు
శొంఠిని మెత్తగా నూరి ఆ పొడిని నీటిలో కలిపిన తలకు రాసుకోవాలి. ఇలా రాసుకున్నప్పుడు కాస్తంత మంటగా అనిపిస్తుంది. కాని నొప్పి తీసేసినట్టు పోతుంది. శొంఠి పేస్టుని చెవుల వెనుక రాసుకుంటే కూడా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. శొంఠి, మిరియాలు, వాము, సైంధవలవణం అన్నీ కలిపి మెత్తగా నూరి తేనెతో తీసుకుంటే అతిగా వచ్చే ఆవలింతలు తగ్గుతాయి.